ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నీరసం తెప్పించింది. భారీ బ్యాటింగ్ లైనప్ తో హిట్టింగ్ చేస్తూ విరుచుకుపడుతుందని భావించిన న్యూజిలాండ్ ఆరంభం, ఎండింగ్ పర్వాలేదనిపించినా మిడిల్ ఓవర్లు మాత్రం నిద్ర నీరసం తెప్పించేసింది. ఓ వైపు టీమిండియా స్పిన్నర్ల ధాటికి వికెట్లు పడిపోతుంటే మరో వైపు డారెల్ మిచెల్, గ్లెస్ ఫిలిప్స్ బంతులను కరిగించారు. డారెల్ మిచెల్ బ్యాటింగ్ అయితే టెస్టు మ్యాచ్ ను తలపించింది. మ్యాచ్ ప్రారంభం కాగానే రచిన్ రవీంద్ర, విల్ యంగ్ కలిసి భారత్ మీద విరుచుకుపడ్డారు. 57 పరుగులకు కానీ తొలి వికెట్ దక్కలేదు టీమిండియాకు. ఆ తర్వాత భారత స్పిన్నర్లు ప్రధానంగా కుల్దీప్ న్యూజిలాండ్ ను భయపెట్టాడు. రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేయటంతో పాటు కేన్ విలియమ్సన్ వికెట్టూ తీసుకున్నాడు. అయితే డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు, పరుగులు రాకున్నా వికెట్లు అయితే పడకుండా జాగ్రత్త పడ్డారు. చివర్లో బ్రేస్ వేల్ హాఫ్ సెంచరీతో దంచుడు దంచటంతో న్యూజిలాండ్ అతి కష్టం మీద 7 వికెట్ల నష్టానికి 251పరుగులు చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ తోపాటు వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ 252 పరుగులు కాబట్టి స్టార్టింగ్ నుంచే హిట్ మ్యాన్ ఆ తర్వాత విరాట్ కొహ్లీ విచురుకుపడాలని ఫ్యాన్సంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.